మీరు చికెన్ తినే వారయితే ఈ వార్త తప్పని సరిగా చదవాలి. మన దేశంలో చికెన్లో విరివిగా ఆంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తున్నారు.
కోళ్ళలో రోగాలను తగ్గించేందుకే కాకుండా అవి తొందరగా పెరిగేందుకు కూడా ఇష్టం వచ్చినట్లు ఆంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. ఆంటీబయాటి క్స్ ను కోళ్ళకు ఇచ్చే ఆహారంలో కలిపి ఇస్తున్నారు. దీని వల్ల కోడి తొందరగా పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉంటుంది. లాభాల కోసం కోళ్ళ పరిశ్రమ ఈ పని
చేస్తుంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ జరిపిన అధ్యయనంలో 40 శాతం కోళ్ల్ళ సాంపుల్స్ లో ఈ ఆంటీబయాటిక్స్ కనిపించాయి. దీనివల్ల ఆ కోడిలోనే ఆంటీబయాటి క్స్ ను తట్టుకొనే బ్యాక్టీరియా పెరుగుతోంది. చికెన్ తిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి వెళ్తోంది. ఫలితంగా మనిషికి అవసరమొచ్చిపప్పుడు ఆంటీబయాటిక్స్ వాడినప్పుడు అవి పనిచేయడం లేదు. కోడి
మాంసం తినేవారు తమకు తెలియకుండానే కొద్ది మోతాదులో ఆంటీబయాటిక్స్ ను అవసరం లేకుండా తీసుకుంటున్నారు. దీనివల్ల వారి శరీరాలు ఆంటీబయాటిక్స్ పనిచేయకుండా తయారవుతున్నాయి. ఇప్పటికే సెప్టిక్, న్యుమోనియా, టి బి లాంటి రోగాలకు వాడే ఆంటీబయాటక్స్
పనిచేయడం లేదు. ఆంటీబయాటిక్స్ ను తట్టుకునే బ్యాక్టీరియా మానవ శరీరంలోను, పర్యావరణంలోను తయారు కావడం వల్ల ఆ ఆంటిబయాటిక్స్ మనిషి అవసరమొచ్చినప్పుడు వాడినా కూడా
పనిచేయవు. అందులోను మనిషికి అత్యవసరమైన ఆంటీబయాటిక్స్. ను కోళ్ళ క్రుత్రిమ పెరుగుదలకు వాడుతున్నారు. ఈ.ఆంటీబయాటిక్స్ పనిచేయకుండా అయితే మానవాళికి తీవ్ర ప్రమాదం.
ఇప్పటికే యూరోపియన్ దేశాలలో కోళ్ళ పెరుగుదలకు ఆంటీబయాటిక్స్ ను వాడడం నిషేదించారు. మనదేశంలో కూడా తక్షణం దీనిని నియంత్రంచకుంటే తీవ్ర ఉపద్రవం రాబోతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో కోళ్ళ పరిశ్రమ ప్రతి ఏడాది 10 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంటోంది. మనం వాడే మాంసంలో 50 శాతం మేరకు చికెన్ యే ఉంటోంది. చికెన్ ప్రీయులు జాగ్రత్త
వహించడమే కాకుండా కోళ్ళలో ఆంటీబయాటిక్స్ ను క్రుత్రిమ పెరుగుదలకు వాడడానికి వ్యతిరేకంగా స్పందించాలి.
No comments:
Post a Comment