ITEACHERZ QUICK VIEW

05 July, 2015

Fwd: శాస్త్ర విజ్ఞానము

---------- Forwarded message ----------
From: "శాస్త్ర విజ్ఞానము" <noreply+feedproxy@google.com>
Date: Jul 5, 2015 8:21 AM
Subject: శాస్త్ర విజ్ఞానము
To: <srinivasarao.thanga@gmail.com>

శాస్త్ర విజ్ఞానము


ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ

Posted: 04 Jul 2015 03:40 AM PDT



ప్రియమైన బ్లాగర్లకి

గత ఏడాది చేపట్టిన 'ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ' ముగిసింది. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లో 330 తెలుగు మీడియం బడులకి ఉచితంగా ఈ కింది 6 పుస్తకాలు పంపడం జరిగింది.
1.     ఆల్బర్ట్ ఐన్‍స్టయిన్ – వైజ్ఞానిక విప్లవకారుడు
2.    ఐసాక్ న్యూటన్ – జీవితం, కృషి
3.    పాతాళానికి ప్రయాణం – జూల్స్ వెర్న్ రాసిన Journey to the Center of the Earth కి అనువాదం
4.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 1వ భాగం. ఐసాక్ అసిమోవ్. (తెలుగు అనువాదం)
5.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 2వ భాగం. "
6.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 3వ భాగం. "
ఇందులో భాగంగా వ్యాస రచన పోటీ కూడా నిర్వహించబడింది. అందులో పాల్గొన్న విద్యార్థులకి ఉచితంగా వాళ్లు అడిగిన పుస్తకాల ప్రతులు పంపించడం జరిగింది.
ఈ ఏడాది కూడా ఇదే ప్రాజెక్ట్ మళ్లీ నిర్వహించబోతున్నాం. ఈ సారి మరి కొన్ని కొత్త, సైన్స్ పుస్తకాలు ప్రచురించి పంపడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా స్కూలు టీచర్లు పాల్గొని, పుస్తకాలు పిల్లలకి అందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పుస్తకాలలోని అంశాలని టీచర్లు చదివి, పిల్లల చేత చదివించి, ఆ విషయాలు పిల్లలతో చర్చించే ప్రయత్నం చేస్తే బావుంటుంది. అలాంటి ఆసక్తి కల టీచర్లు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించవలసిందని మనవి.

-      శ్రీనివాస చక్రవర్తి

You are subscribed to email updates from శాస్త్ర విజ్ఞానము
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States

No comments:

Post a Comment

Popular Posts