పీఆర్సీపై 4 జీవోల నంబర్ల జారీ
43 శాతం ఫిట్మెంట్, నూతన వేతనాల స్థిరీకరణకు అవసరమయ్యే డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ.. మొత్తం నాలుగు జీవోలు (నం. 46, 47, 48, 49) గురువారం రాత్రి వెబ్సైట్లో పెట్టారు. జీవోలకు నంబర్లు మాత్రమే ఇచ్చామని, పూర్తి జీవోలను శుక్రవారం అప్లోడ్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారుల వారు చెప్పారు. ఏప్రిల్ నుంచి కాకుండా మే నుంచి కొత్త వేతనాలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో పీఆర్సీ మిగతా సిఫారసుల అమలుకు గాను జీవోల కోసం మళ్లీ కాళ్లరిగేలా తిరగకతప్పదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రభుత్వం ఆమోదించాల్సిన సిఫారసులివే..
1. కేంద్ర ప్రభుత్వం తరహాలో మహిళా ఉద్యోగులకు 2 ఏళ్లపాటు పిల్లల సంరక్షణ సెలవు.
2. ఈఎల్స్ను ఉద్యోగ విరమణ సమయంలో నగదుగా మార్చుకొనే అవకాశాన్ని స్థానిక సంస్థల ఉద్యోగులు, టీచర్లు, ఎయిడెడ్ విద్యా సంస్థల సిబ్బందికి పునరుద్ధరణ.
3. పే స్కేళ్లు పెరిగిన నేపథ్యంలో.. రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంపు.
4. అంత్యక్రియల ఖర్చు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు.
5. 25 ఏళ్లపాటు సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్కు అర్హత.
6. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగినులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు.
7. ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) పరిమితి రూ. 12,500 నుంచి రూ.18,750కు పెంపు.
8. పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజు రూ. 1,000 నుంచి రూ.2,500కు పెంపు.
No comments:
Post a Comment