ఒంగోలు ఒన్టౌన్ : జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరానికి విద్యా వార్షిక ప్రణాళికను ఖరారు చేసినట్లు డీఈఓ ,డీసీఈబీ చైర్మన్ బి.విజయభాస్కర్,
డీసీఈబీ కార్యదర్శి జి.పుల్లారెడ్డి
తెలిపారు. ఈ ఏడాది పాఠశాలల
మొత్తం పని దినాలు 229 అని,
స్వయం నిర్ణయక, ఐచ్ఛిక
సెలవులు మొత్తం 8 పోను,
పాఠశాలలు నికరంగా 221 రోజులు పని
చేయాలని పేర్కొన్నారు. ఇతర
సెలవులను ప్రభుత్వ ప్రకటనల
మేరకు పాఠశాలల్లో
అమలు చేయాలన్నారు. ఐచ్ఛిక
సెలవులు 5, స్వయం నిర్ణయక
సెలవులు 3 వాడుకునే
వివరాలను పాఠశాలల తనిఖీ అధికారికి
ముందుగా సమాచారం అందజేయాలని
వివరించారు. మారిన నిబంధనల
ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు.
- జూలైలో నిర్మాణాత్మక మదింపు-1
(ఫార్మెటివ్ అసెస్మెంట్ -1)
నిర్వహించాలి.
- ఆగస్టులో నిర్మాణాత్మక
మదింపు-2 (ఫార్మెటివ్ అసెస్మెంట్
-2) నిర్వహించాలి.
- సెప్టెంబర్లో సంగ్రహణాత్మక
మదింపు -1 (సమ్మెటివ్
అసెస్మెంట్-1) నిర్వహించాలి. ఈ
పరీక్షలను సెప్టెంబర్ 11 నుంచి
23వ తేదీ వరకు నిర్వహించాలి.
ఆగస్టు సిలబస్ వరకు మాత్రమే
ప్రశ్నలివ్వాలి.
- పాఠశాలలకు సెప్టెంబర్ 24వ తేదీ
నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా
సెలవులు ప్రకటించాలి. సెలవుల
అనంతరం 6వ తేదీన
పాఠశాలలను పునఃప్రారంభించాలి.
- నవంబర్లో నిర్మాణాత్మక
మదింపు-3 (ఫార్మెటివ్ అసెస్మెంట్
-3) నిర్వహించాలి.
- డిసెంబర్లో సంగ్రహణాత్మక
మదింపు -2 (సమ్మెటివ్
అసెస్మెంట్-2) నిర్వహించాలి.
డిసెంబర్ 10 నుంచి 22వ తేదీ
వరకు పరీక్షలు నిర్వహించాలి.
నవంబర్ సిలబస్ వరకు మాత్రమే
ప్రశ్నలివ్వాలి.
- క్రిస్టియన్ యాజమాన్య
పాఠశాలలకు డిసెంబర్ 24 నుంచి
2015 జనవరి 2వ తేదీ
వరకు సెలవులు ప్రకటించాలి. జనవరి
3న పాఠశాలలను పునఃప్రారంభించాలి.
- ఇతర యాజమాన్యాల
పాఠశాలలకు జనవరి 7వ తేదీ నుంచి
16వ తేదీ
వరకు సెలవులు ప్రకటించాలి. 17న
పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
- ఫిబ్రవరిలో నిర్మాణాత్మక
మదింపు -4 (ఫార్మెటివ్ అసెస్మెంట్
-4) నిర్వహించాలి. ఈ
మదింపును ఫిబ్రవరి 19వ తేదీ
నుంచి మార్చి 2వ తేదీ
లోపు నిర్వహించాలి.
- ఏప్రిల్లో సంగ్రహణాత్మక
మదింపు -3 (సమ్మెటివ్
అసెస్మెంట్-3) నిర్వహించాలి. ఏప్రిల్
9 నుంచి 21వ తేదీ వరకు ఈ
పరీక్షలు నిర్వహించాలి.
పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్
11వ తేదీ వరకు వేసవి
సెలవులు ప్రకటిస్తారు. వేసవి
సెలవుల అనంతరం జూన్ 12న
పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని
వారు వివరించారు.
ITEACHERZ QUICK VIEW
14 July, 2014
ప్రకాశం జిల్లా విద్యా వార్షిక ప్రణాళిక 2014-15
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Model school Syllabus Structure for PRINCIPALS: PRINCIPALS EXAM PATTERN: Part – I: Essay Type (Marks: 25) CONTEMPORARY SOCIAL, ECONOMIC AND...
-
https://groups.google.com/group/gunasri/attach/a1d5bb485edfc4bd/newschool.pdf?part=4
-
Results Of Notification No. 11/2011 , Departmental Tests NOVEMBER 2010 Results View H...
-
Dear Readers and viewers, our teachers are facing some troubles to download the DSC lists from right pan of this blog, I have reposted all ...
-
Board of Secondary education of Andhra Pradesh has maintained a large database in getting AP SSC Marks List from June 2004 to March 2011...
-
Hall Ticket download : Notification ...
-
The AP Department of School Education board are going to recruit 7100 teachers for Newly started AP model schools in Andhra pradesh Stat...
-
Dear teachers, The question banks prepared by IASE, kurnool are very use ful for March 2019 Exams and some of the models are given in PS ...
-
HINDI TELUGU ENGLISH MATHS&P.S BIOLOGY SOCIAL PKM-GR II-ZP-HMseniority list 14-06-2013-final(07-08-2013)
-
HYDERABAD: The Chief Minister Mr N Kiran Kumar Reddy today thanked the Union Minister for Human Resources Development, Kapil Sibal for ...
No comments:
Post a Comment