A REAL ANALYSIS ON CENTRAL BUDGET - A MUST READ TOPIC FOR EVERY EDUCATED CITIZEN OF INDIA.
సామ్రాజ్యవాదుల కోసం తయారు చేసిన శ్వేతపత్రం, బడ్జెట్ 2015-16 -(1)
స్వదేశీ,
విదేశీ ప్రభువర్గాలు ఏరి కోరి తెచ్చుకున్న మోడి ప్రభుత్వం తమపై ఉంచిన
విశ్వాసాన్ని కాపడుకుంటూ మొట్ట మొదటి పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ 2015-16
ను ప్రవేశపెట్టింది. బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వం మెజారిటీ సాధించినట్లు
వార్తలు వెలువడుతుండగానే పశ్చిమ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు కొత్త
ప్రభుత్వం నెరవేర్చవలసిన తమ డిమాండ్లు ఏమిటో విస్పష్టంగా తమ కార్పొరేట్
మీడియా ద్వారా ప్రకటించాయి. ఆ డిమాండ్లను త్రికరణశుద్ధిగా నెరవేర్చుతూ మోడి
ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వేసిన అడుగు ‘బడ్జెట్ 2015-16′. ఒకవైపు తమది పేద
ప్రజల ప్రభుత్వం అని ప్రకటిస్తూనే, మరోవైపు ఆ ప్రజల ప్రయోజనాలను తీవ్రంగా
దెబ్బకొట్టే విధంగా పలు నయా ఉదారవాద ఆర్ధిక చర్యలను బడ్జెట్ 2015-16 లో
మోడి ప్రభుత్వం ప్రకటించింది. తమ బడ్జెట్ చర్యలు కార్పొరేట్లకు అంకితమన్న
సంగతిని దాచి ఉంచడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా
శ్రమించినప్పటికీ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ పత్రికలు, షేర్ మార్కెట్లు
ప్రకటించిన సంతోషాతిరేకాలు ఆయన శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చాయి.
“జైట్లీ
బడ్జెట్ ‘బిగ్ బ్యాంగ్’ బడ్జెట్ కానప్పటికీ వృద్ధి దృక్పధంతో
(గ్రోత్-ఓరియెంటెడ్) రూపొందించిన బడ్జెట్” అని రాయిటర్స్ వార్తా సంస్ధ
సంతృప్తి ప్రకటించింది. ఇప్పటి పాదార్ధిక విశ్వం ఒక చిన్న అణువు పెద్ద
పెట్టున పేలిపోవడం వల్ల ఉద్భవించిందని గ్రహశాస్త్రంలోని ‘బిగ్ బ్యాంగ్
సిద్ధాంతం’ చెబుతుంది. అణువు పేలి విశ్వం ఆవిర్భవించినట్లుగానే, బహుళజాతి
ప్రైవేటు కంపెనీలకు మేలు చేసే విధంగా, మోడి-జైట్లీ బడ్జెట్ పెద్ద పెట్టున
పేలి లాభాలు రాల్చాలని బడ్జెట్ కు ముందే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు
డిమాండ్ చేశాయి. ఫైనాన్షియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, బిజినెస్
స్టాండర్డ్, రాయిటర్స్ లాంటి పత్రికలు మోడి ప్రభుత్వం తమ బడ్జెట్ లో ‘బిగ్
బ్యాంగ్’ సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఖర్చు బాగా
తగ్గించాలని కోరాయి.Read More @
Analysis - 1 on Budget 2015-16 by జాతీయ, అంతర్జాతీయ వార్తలు
ఎం.ఎన్.సిల డిమాండ్లు నెరవేర్చే బడ్జెట్ 2015-16 -(2)
మౌలిక
నిర్మాణాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసమే అని చెబుతూ జైట్లీ బడ్జెట్ తీసుకున్న
మరొక చర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేయడం. ఈ తరహా బాండ్లు జారీ
చేయడం మోడి-జైట్లీ బృందం కనిపెట్టినదేమీ కాదు. ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక
మంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేసి నిధులు
సేకరించారు. అయితే అప్పటి ప్రభుత్వం వాటిపై పన్నులు వసూలు చేసింది. జైట్లీ
బడ్జెట్ పన్నులు లేని బాండ్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఏ పేరుతో
బాండ్లు జారీ చేసినా అది ప్రాధమికంగా ఋణ సేకరణ. కనుక అది ఋణ దాతల ఆదాయం. ఈ
విధంగా పన్నులు కట్టనవసరం లేని ఆదాయాన్ని ధనిక వర్గాలకు జైట్లీ బడ్జెట్
సమకూర్చుతోంది. బాండ్ల కొనుగోళ్ళు వేలు, లక్షలలో ఉండదు. కోట్లలో ఉంటాయి.
వందల కోట్లలో కొనుగోలు చేసినా చేయవచ్చు.
పేరుకి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పినప్పటికీ పన్ను రహిత బాండ్ల అసలు
ఉద్దేశ్యం ధనిక వర్గాలకు పన్నులు లేని ఆదాయ మార్గాలను, డబ్బు దాచుకునే
చోట్లను అధికారికంగా సృష్టించడం! అనగా ఒక పక్క అవినీతికి వ్యతిరేకం అని
చెబుతూ అధికారికంగానే అవినీతి సొమ్మును తెల్ల డబ్బుగా మార్చే ప్రక్రియకు
శ్రీకారం చుట్టారు. ఇది ప్రజల కోసం చేసినట్లుగా కనిపిస్తూ వాస్తవంలో
సంపన్నుల ఆస్తి మరింత పెరిగేందుకు దోహదం చేసే చర్య. విద్యుదుత్పత్తి,
రోడ్లు రైలు మార్గాల నిర్మాణం, ఇరిగేషన్ తదితర ముఖ్యమైన మౌలిక రంగాల కోసం
అంటూ ఈ పద్ధతిని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టారు.
Read More @
No comments:
Post a Comment