ITEACHERZ QUICK VIEW

05 February, 2015

హైటెక్ ప ద్ధతికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం :: డిడివో లకు బదులుగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఫైనాన్స్ మేనేజర్లు

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిధుల మంజూరు.. చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం హైటెక్ పద్ధతిలో చేపట్టనుంది. ఉద్యోగుల జీతభత్యాలు మొదలుకుని, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నిధుల చెల్లింపుల వ్యవహారాల వరకు అన్నీ ఇకపై ఆన్లైన్లోనే జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ముందుగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఆన్లైన్  చెల్లింపుల విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఈ నెలాఖరులోగా అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన అనంతరం మరింత సమర్ధంగా మే నెలలో మరో నాలుగు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత దశలవారీగా సచివాలయం మొదలు మండలస్థాయి వరకు రాష్ట్రమంతటా ఈ విధానం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా నిధుల మంజూరు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఐటీ ప్రతినిధులతో కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంటు సిస్టమ్పై చర్చించారు. ఈ సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా ప్రభుత్వ నిధుల మంజూరు, చెల్లింపుల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారుల వరకు నిధుల కేటాయింపులు, నిధుల వ్యయం, మిగులు తదితర వివరాలన్నీ ఈ విధానం ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఏర్పడుతుందని వెల్లడించారు. అలాగే నిధుల కేటాయింపులు, చెల్లింపుల విషయంలో కూడా ఏ మాత్రం జాప్యం జరగబోదని తెలిపారు. ఉదోగ్యుల జీతభత్యాల చెల్లింపు విధానాల్లో మార్పులు మరోవైపు.. ఉగ్యోగుల జీతభత్యాలు బిల్లుల చెల్లింపు విధానాల్లో కూడా సమూల మార్పులు చోటచేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ ప్రతి కార్యాలయంలో పేబిల్స్, కంటిజెన్సీ బిల్స్, మెడికల్ రీయింబర్స్ మెంట్, సెలవుల మంజూరు తదితర వాటి కోసం ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ప్రత్యేకంగా పది రోజుల పాటు పనిచేయాల్సి వచ్చేది. ఈ నూతన విధానంలో ఇక డ్రాయింగ్ ఆఫీసర్లే వుండరు. డ్రాయింగ్ ఆఫీసర్లుగా కాకుండా వారి సొంత విధుల్లో పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం కలుగుతుంది.

అలాగే, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ సైతం ఇక డిజిటల్ కానుంది. నిత్యం పర్యవేక్షణ వ్యవస్థ మొత్తం ఆన్లైన్ అయినా నిత్యం పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఫైనాన్స్ మేనేజర్లను నియమించాలని సీఎం సూచించారు. ఎక్కడా అవకతవకలు జరక్కుండా చూసే బాధ్యత ఈ ఫైనాన్స్ మేనేజర్లకు అప్పగించాలన్నారు. ఒక కాంట్రాక్టరు పని చేసిందీ లేనిదీ అధికారి ధ్రువీకరించాలన్నారు. పనులు జరిగిందీ లేనిది వీడియో తీసి ఆన్లైన్లో పెట్టిన తరువాతే  నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. మొత్తం మీద ఈ విధానం ద్వారా చెల్లింపులు, కేటాయింపులు పారదర్శకతతో జరుగుతాయి అని చెప్తున్నా.. వీటిని అర్థం చేసుకోకుండా అధికారులపై భారం మోపితే ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచిచూడాలి.

No comments:

Post a Comment

Popular Posts