ITEACHERZ QUICK VIEW

29 August, 2011

HOW TO PREPARE FOR TENTH SCIENCE :: SAAKSHI

పదో తరగతి సబ్జెక్టులన్నింటిలో భౌతిక, రసాయన శాస్ర్తానికి అధిక సిలబస్, తక్కువ మార్కులు కేటాయించారు. దీన్ని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించవచ్చు.


50/50 మార్కులు సాధించాలంటే...

ఈ లక్ష్యమున్న విద్యార్థులు ముఖ్యమైన ప్రశ్నలను మాత్రమే చదవకుండా పాఠ్య పుస్తకంలోని అన్ని అంశాలపై పట్టు పెంచుకోవాలి.
ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో తెలుసుకుని దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
దృష్టి సారించాల్సిన అంశాలు...
సమస్యలు:
సాధారణంగా శుద్ధ గతిక శాస్త్రం, ప్రవాహ విద్యుత్, ద్రావణాల పాఠ్యాంశాల నుంచి సమస్యలు అడిగే అవకాశముంది.
పై అధ్యాయాల్లోని సూత్రాలు ఒక దగ్గర రాసుకుని, వాటిపై వచ్చే సమస్యలను సాధన చేయాలి. ఈ క్రమంలో మూడు ముఖ్యమైన సోపానాలు పాటించాలి. అవి 1. దత్తాంశం, 2. సూత్రం, 3. సమస్య సాధన
పటాలు, భాగాల గుర్తింపు:
పటాలను సోపాన క్రమంలో సాధన చేయాలి.
పటాల్లో భాగాలను సూచిస్తూ పక్కనే పేర్లు రాయాలి. భాగాలకు వరుస సంఖ్యలు కేటాయించి, వాటిని ఒక జాబితాగా రాయొద్దు.

పటాలు గీయడానికి నాణ్యమైన పెన్సిల్‌ను వాడాలి.
పటానికి పేరు రాయడం మర్చిపోవద్దు.
ప్రమాణాలు, స్థిరాంకాలు:
పాఠ్యపుస్తకంలో వివిధ భౌతికరాశులు, వాటి ప్రమాణాలు, స్థిరాంకాలను పట్టిక రూపంలో రాసుకోవాలి. వాటిని వీలైనప్పుడల్లా మననం చేసుకోవాలి.
దీని కోసం ‘సాక్షి’ భవిత (ఫిజికల్ సైన్‌‌స సంచిక) ఉపయోగకరంగా ఉంటుంది.
బిట్ పేపర్‌పై పట్టు సాధించండిలా...
ముందుగా పాఠ్య పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ముఖ్యాంశాలను, బిట్ల రూపంలో ఉండే వాక్యాలను పెన్సిల్‌తో గుర్తించాలి.
గత ప్రశ్న పత్రాల్లోని బిట్లను సాధన చేయాలి. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు మననం చేసుకోవాలి.
సాధారణంగా బిట్ పేపర్ సాధనకు క్విజ్, గ్రూప్ స్టడీలు సత్ఫలితాలనిస్తాయి.
షార్‌‌టకట్స్‌ను గుర్తుంచుకోవాలి.
రసాయన శాస్త్రంలో సమీకరణాలు, సూత్రాలు; భౌతిక శాస్త్రంలో ప్రమాణాలు, స్థిరాంకాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.

30-35 మార్కులు సాధించాలంటే...
ఈ లక్ష్యం ఉన్న విద్యార్థులు ఎంపికచేసిన అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి.
గత ప్రశ్న పత్రాలను గమనిస్తే కింది అధ్యాయాల్లోంచి తరచుగా ప్రశ్నలు వస్తున్నట్లు తెలుస్తుంది. అవి
భౌతిక శాస్త్రం: కాంతి అయస్కాంతత్వం
ప్రవాహ విద్యుత్ ఆధునిక భౌతిక శాస్త్రం
ఎలక్ట్రానిక్స్
రసాయన శాస్త్రం: పరమాణు నిర్మాణం
రసాయన బంధం
మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు
రసాయనశాస్త్రం - పరిశ్రమలు.
పై అధ్యాయాలతోపాటు కింది వాటిని కూడా సాధన చేయాలి.
స్క్రూగేజీ పటం
అభికేంద్ర, అపకేంద్ర బలాల మధ్య భేదాలు
మెగ్నీషియం విద్యుత్ క్షయకరణ పటం
వజ్రం, గ్రాఫైట్‌ల నిర్మాణాల్లో తేడాలు
పై అధ్యాయాల్లోని ముఖ్య వ్యాసరూప ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, పటాలు, బిట్స్ మొదలైన వాటిని విపులంగా చదువుతూ, పూర్తి పట్టు సాధించినట్లయితే, 30 నుంచి 35 మార్కులు సులభంగా సాధించొచ్చు.

భౌతికశాస్త్రం - ముఖ్య ప్రశ్నలు

1.అభికేంద్ర, అపకేంద్ర బలాల మధ్య భేదాలేవి?
2.న్యూటన్ కణ సిద్ధాంతం, హైగెన్ తరంగ సిద్ధాంతాల మధ్య భేదాలను తెల్పండి?
3. రిపుల్‌టాంక్ నిర్మాణాన్ని వివరించండి?
4. లేజర్ అనువర్తనాలు తెల్పండి?
5. ఈవింగ్ అణు సిద్ధాంతం ముఖ్య భావనలు, లోపాలను పేర్కొనండి?
6. డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాల ధర్మాలను పోల్చండి?
7. ఓమ్ నియమాన్ని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి?
8  R = R 1 + R 2 + ........ ను ఉత్పాదించండి ?
9  1 / R = 1 / R 1 + 1 / R 2 + ........ ను ఉత్పాదించండి ?
10  Q = i2Rt / J  ను ఉత్పాదించండి ?
11  ఫారడే రెండో విద్యుద్విశ్లేషణ నియమాన్ని ఉత్పాదించండి ?
12  ట్రాన్స్ ఫార్మర్  నిర్మాణాన్ని చక్కని పట సహాయంతో వివరించండి ?
13 






















రసాయనశాస్త్రం - ముఖ్య ప్రశ్నలు
1. బోర్ పరమాణు నమూనాలోని ముఖ్య ప్రతిపాదనలు, లోపాలను పేర్కొనండి?
2. అయనీకరణ శక్మం అంటే ఏమిటి? దాన్ని ప్రభావితం చేసే అంశాలేవి?
3. ఆఫ్‌బౌ నియమాన్ని వివరించండి?
4. క్వాంటం సంఖ్యల గురించి రాయండి?
5. ఆక్సిజన్‌లో ద్విబంధం ఏర్పడే విధానాన్ని వివరించండి?
6. నైట్రోజన్‌లో త్రిక బంధం ఏర్పడే విధానాన్ని వివరించండి?
7. సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడే విధానాన్ని ఉదాహరణ ద్వారా వివరించండి?
8. ఆధునిక ఆవర్తన నియమం, ముఖ్య లక్షణాలేవి?
9. ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మూలకాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారో వివరించండి?
10. పీరియడ్, గ్రూపుల్లో కింది ధర్మాలు ఏ విధంగా మారతాయో వివరించండి?
పరమాణు పరిమాణం, అయనీకరణ శక్మం, రుణవిద్యుదాత్మకత, ఆక్సీకరణ, క్షయకరణ ధర్మాలు
11. టోలెన్స్ కారకాన్ని ఎలా తయారుచేస్తారు? దానితో గ్లూకోజ్‌ను ఎలా పరీక్షిస్తారు?
12. బెనెడిక్ట్ కారకాన్ని ఎలా తయారుచేస్తారు? దానితో గ్లూకోజ్‌ను ఎలా పరీక్షిస్తారు?
13. చక్కెర తయారీలోని దశలను వివరించండి?
14. ఆల్కహాల్ తయారీలో దశలను వివరించండి?
15. సిమెంట్ తయారీని వివరించండి?
16. పెట్రోలియం శుద్ధిని గురించి వివరించండి?
17. మందు అంటే ఏమిటి? ఆదర్శ మందు సంతృప్తి పరచాల్సిన నియమాలను తెల్పండి?
18. మందు అంటే ఏమిటి? చికిత్సా చర్య ఆధారంగా మందులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
19. కుండ పాత్రలు, మృణ్మయ పాత్రలపై లఘు వ్యాఖ్య రాయండి?
20. మంచి పౌడర్‌కు ఉండాల్సిన లక్షణాలేవి?

సమాధానాలు రాయండిలా...
ముందుగా ప్రశ్న పత్రాన్ని రెండు లేదా మూడు సార్లు చదివి బాగా రాయగల ప్రశ్నలను పెన్సిల్‌తో గుర్తించాలి. తర్వాత సమాధానాలు రాయాలి.
స్వల్ప సమాధాన ప్రశ్నలకు సాధ్యమైనంత క్లుప్తంగా జవాబు రాయాలి.
అవసరమైన చోట పటం గీయాలి.
వ్యాసరూప సమాధానాలను పాయింట్ల వారీగా రాయాలి.
సమాధానంలోని ముఖ్య పదాలను హైలైట్ చేయాలి.
ముందుగా చాయిస్ ప్రకారం రాయాల్సిన 14 ప్రశ్నలు (2 మార్కులవి 5, 1 మార్కువి 4, 4 మార్కులవి 4, 5 మార్కుల పటం 1) రాసిన తరువాతే అదనపు ప్రశ్నలకు సమాధానం రాయాలి.
అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి.
సాధ్యమైనంత వరకు ఉత్పాదనలు, సమస్యలు, భేదాలు వంటి వాటిని చాయిస్ ప్రకారం ఎన్నుకొని సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు.


పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ‘సైన్‌‌స’ సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే జీవ శాస్త్రంపై పట్టు సాధించాలి. పద్ధతి ప్రకారం ప్రిపేరైతే కేవలం బయాలజీ పేపర్‌లో సాధించే మార్కులతోనే ‘సైన్‌‌స’ సబ్జెక్టులో ఉత్తీర్ణులు కావచ్చు.

50/50 మార్కులు సాధించాలంటే...
యూనిట్-1 నుంచి 23 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ యూనిట్‌ను బాగా ప్రిపేరైతే అధిక మార్కులు పొందొచ్చు. ఈ యూనిట్‌లోని కింది వాటిల్లోంచి ప్రతి ఏటా ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తోంది. అవి..
1 కిరణజన్య సంయోగక్రియలో కార్బన్‌డైఆక్సైడ్ అవసరం అని నిరూపించడం.
2. కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం అని నిరూపించడం
3. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించడం
4. శ్వాసక్రియలో వేడి విడుదల అవుతుందని నిరూపించడం.
5. కార్బన్‌డైఆక్సైడ్ గ్లూకోజ్‌గా ఏ విధంగా మార్పు చెందుతుంది. (నిష్కాంతి చర్య)
ప్రయోగానికి సంబంధించి జవాబులు రాసేటప్పుడు కింది సైడ్ హెడ్డింగ్‌‌స తప్పనిసరిగా రాయాలి.
1. ఉద్దేశం, 2. కావాల్సిన పరికరాలు, 3. ప్రయోగం చేసే విధానం, 4. పరిశీలన, 5. పటం
ది జవాబు రాయడానికి ముందే పటం గీస్తే పూర్తి మార్కులు పొందొచ్చు.
యూనిట్-2 నుంచి 14.5 మార్కులు, యూనిట్-5 నుంచి 14.5 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండు యూని ట్‌లను బాగా ప్రిపేరైతే అధిక మార్కులు సాధించొచ్చు.
యూనిట్-3 నుంచి 18 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఈ యూనిట్‌ను శ్రద్ధగా చదివితే అధిక మార్కులు పొందొచ్చు. ఈ యూనిట్‌లో మూడు ముఖ్య పటాలు ఉన్నాయి.
యూనిట్-4 హెచ్‌ఐవీ, ఎయిడ్‌‌స నుంచి 5 మార్కులకు కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈ యూనిట్‌లో ప్రిపేర్ అయ్యే ప్రశ్నల సంఖ్య కూడా చాలా తక్కువ.
పర్యావరణ విద్య యూనిట్ నుంచి 6 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఈ యూనిట్‌లో కేవలం 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నలు, బిట్స్ మాత్రమే ప్రిపేర్ అవడం మంచిది.

ఎగ్జామినేషన్ టిప్స్

ప్రశ్న పత్రాన్ని పూర్తిగా చదివి బాగా రాయగలిగే ప్రశ్నలకే ముందుగా సమాధానాలు రాయాలి. పటాలకు (5 మార్కులు) సంబంధించి రెండు ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా మొక్కలకు సంబంధించిన విభాగం నుంచి ఒక ప్రశ్న, జంతువులకు సంబంధించిన విభాగం నుంచి ఒక ప్రశ్న పబ్లిక్ పరీక్షల్లో అడుగుతున్నారు. కాబట్టి మొక్కలకు సంబంధించిన ‘అయిదు’ పటాలు బాగా ప్రాక్టీస్ చేస్తే.. కచ్చితంగా 5 మార్కులు పొందవచ్చు.
మొక్కలకు సంబంధించిన పటాలు...
1. ఉమ్మెత్త పువ్వు నిలువుకోత, 2. ఆకు అడ్డుకోత, 3. మొక్కల్లో అండం నిర్మాణం, 4. మొక్కల్లో ఫలదీకరణం, 5. మైటోకాండ్రియా నిర్మాణం
పటం (5 మార్కుల ప్రశ్న)లో స్పష్టంగా భాగాలు గుర్తించాలి. పటానికి 3 మార్కులు, భాగాలకు 2 మార్కులు ఉంటాయి.
ఒకటి, రెండు మార్కుల ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ప్రశ్నలకు తగ్గటు జవాబులు స్పష్టంగా, క్లుప్తంగా, సూటిగా రాయాలి.
ఉదా: శ్వాసక్రియ ఆధారాలు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి?
శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తి విడుదల చేసే పదార్థాలను శ్వాసక్రియ ఆధారాలు అంటారు. (1 మార్కు)
1. కార్బోహైడ్రేట్‌లు(1/2 మార్కు)
2. కొవ్వులు (1/2 మార్కు)
నాలుగు మార్కుల ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు తప్పనిసరిగా పాయింట్ల వారీగా రాయాలి. ఎనిమిది పాయింట్లకు తగ్గకుండా సమాధానం ఉండాలి.
భేదాలకు సంబంధించి ప్రశ్న ఏటా తప్పనిసరిగా అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలను తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి. భేదాలు పట్టిక (Table) రూపంలో రాస్తే పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంది.
ఉదా:
1. కుడి కర్ణిక, ఎడమ కర్ణికల మధ్య భేదాలు?
2. కుడి జఠరిక, ఎడమ జఠరికల మధ్య భేదాలు?
3. కిరణజన్యసంయోగక్రియ, శ్వాసక్రియ మధ్య భేదాలు?
4. ఎర్ర, తెల్లరక్తకణాల మధ్య భేదాలేవి?
హెడ్డింగ్‌‌స, సైడ్ హెడ్డింగ్‌‌స, ముఖ్యాంశాలను కచ్చితంగా అండర్‌లైన్ చేయాలి.
కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన జీవశాస్త్రం పాఠ్య పుస్తకంలోని ప్రతి పాఠం వెనుక ఉన్న ఖాళీలు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు బాగా ప్రిపేరవ్వాలి.
సాక్షి భవిత, విద్యలో ప్రచురిస్తున్న బిట్ బ్యాంక్, క్వశ్చన్ అండ్ ఆన్సర్‌‌స, ముఖ్య ప్రశ్నలు, వెబ్‌సైట్‌లోని మెటీరియల్‌ను ఉపయోగించుకొని బయాలజీలో మంచి మార్కులు సాధించవచ్చు

No comments:

Post a Comment

Popular Posts