ITEACHERZ QUICK VIEW

19 February, 2012

ప్రస్తుత ఏడాదికూడా పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకూడా 8.5శాతం వడ్డీనే ఇవ్వాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గడువు దగ్గర పడుతుండటంతో ఆ సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో కేంద్ర కార్మిక శాఖామంత్రి మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) ప్రస్తుతమున్న వడ్డీ రేట్లనే చెల్లించాలని నిర్ణయించింది.దీనికి సంబంధించి ప్రస్తుతం రూ. 1.82 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లపై ఈ వడ్డీని చెల్లిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది. ఇదిలావుండగా ఈపీఎఫ్ రిటర్న్ దాఖలులో 8.5శాతం ఉంటే పీఎఫ్ పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి 80సీ పన్ను రాయితీ ఉంటుంని అధికార వర్గాలు చెపుతున్నాయి.కాగా భారతీయ స్టేట్ బ్యాంక్‌కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25-50 బేసిక్ పాయింట్లను తగ్గించాలని నిర్ణయించినా, ఈపీఎఫ్ఓ మాత్రం వరుసగా ఐదో సంవత్సరం కూడా వడ్డీ రేటును తగ్గించలేదు.

No comments:

Post a Comment

Popular Posts