రైతు సమస్యలపై లోక్‌సత్తా పార్టీ పోరు ప్రారంభమైంది. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి రైతు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకూ కొనసాగనుంది.
ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జేపీ నివాళులు అర్పించారు. ఇంకా సంకెళ్లతో బియ్యం బస్తా మోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. గిట్టుబాటు ధరలు సగానికి సగం పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం ఉండాలన్నారు.
పండించిన పంటను అమ్ముకోవటానికి ఆంక్షలు పెట్టడం సరికాదని జేపీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయని జేపీ తెలిపారు

No comments:
Post a Comment