ITEACHERZ QUICK VIEW

30 April, 2013

Poetry I like most :: The Mother Hood by Smt.Meraj Fathima Garu

అమ్మతనం 
--by Meraj Fathima


కల్లు తాగిన కారుకూతల్లో
తన తల్లినే పతితగా వింటుంది.

కట్న కానుకలు తక్కువనే కరకునోళ్ళకు ,
జడిసి తల వంచుకుంటుంది.

ఆడపిల్లని కన్నావని తూలనాడినా,
తప్పు తనదే అనుకుంటుంది.

బిడ్డల నడవడిక బాగలేకున్నా,
తానే కారణమంటే నిజమే అనుకుంటుంది.

యెడారి ప్రస్తానంలో తీరని దాహాల వెంట,
పరుగులెడుతూనే ఉంది.

నడివయస్సులో కూడా తనవారికోసం,
పడిలేస్తూ పనిచేస్తూనే ఉంటుంది .

కన్నకూతురికి పెళ్ళి చేసి ,
తనలాంటి రాత వద్దని మొక్కుకుంటుంది.

కోడలి నాగరికత ముందు,
నిశాని అయిన తానే తలఒగ్గుతుంది.

అందరిలో ఉన్నా ఒంటరితనం,
తన తప్పులేకున్నా నిందమోసేతనం.

ఇంటిల్లిపాదికీ నీడనిచే తరువుతనం,
అమ్మ పేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
30.4.13.
 
my comment:
" తరువు తనం " - అద్భుతమైన పోలిక.  ఇవ్వడమే తప్ప అడగడం తెలియనిది , ఎన్నో విధాలుగా ఆదర్శప్రాయం అయిన చెట్టు తో అమ్మ ను పోల్చడం .

No comments:

Post a Comment

Popular Posts