జాతీయపతాక నియమావళి అనేది భారత జాతీయపతాక వాడకాన్ని నిర్దేశించే చట్టాల సమాహారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాతీయపతాకం
ఉత్పత్తి తగు నిర్దేశకాల ప్రకారమే జరిగేటట్లు పర్యవేక్షిస్తుంది.
నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్ష తప్పదు. ఈ నియమావళిని Emblems and
Names (Prevention of Improper Use) Act, 1950 (No.12 of 1950) and the
Prevention of Insults to National Honour Act, 1971 (No. 69 of 1971) అనే
రెండు చట్టాల్లోని అంశాలను కలిపి 2002లో రూపొందించారు.
ఈ నియమావళి చాలా కఠినంగా ఉందనీ, సాధారణ పౌరులు తమ ఇండ్లమీద, ఇతర
భవంతులమీద జెండానెగరేసే అవకాశం లేకుండా చేసిందనీ విమర్శలుండేవి. చాలా
సంవత్సరాలు కేవలం ప్రభుత్వ భవంతులమీదనూ, ప్రభుత్వాధికారులకూ మాత్రమే
జెండానెగరేసే ఆధికారముండేది
courtesy: వికీపిడియా - తెలుగులో
No comments:
Post a Comment