జస్టిన్
లీ, ఆలివర్ యే అనే ఆ విద్యార్థులు రూపొందించిన విధానానికి కావలసిన సరంజామా
చాలాసింపుల్! సాఫ్ట్ డ్రింక్స్ చల్లగా ఉంచుకోవడానికి వాడే స్టైరోఫోమ్
పెట్టె, ఓ సాధారణ కెమేరా (Canon A470),జి.పి.ఎస్. సౌకర్యం ఉన్న ఓ
ప్రీపెయిడ్ సెల్ ఫోన్. పబ్లిక్ టాయిలెట్ లలో వాడే చేతులు డ్రై
చేసుకునేడ్రయర్ కూడా ఆ పెట్టెలో ఉంచారు. పైన చలికి బ్యాటరీలు పనిచెయ్యడం
ఆగిపోకుండా ఆడ్రయర్ కాపాడుతుంది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా కావలసినది
ఓహీలియం బెలూన్. వాతావరణ పరిశోధనల్లో ఇలాంటి బెలూన్ లని వాడతారు.ఈ మొత్తం
సరంజామాకి అయిన ఖర్చు కేవలం $150 (Rs 7500).
2009, సెప్టెంబర్ 2 నాడు బెలూన్ కి ఆ పెట్టెను కట్టి ఆకాశంలోకి వదిలేశారు.మసాచుసెట్స్ రాష్ట్రంలో, స్టర్ బ్రిడ్జ్ అనే ఊరి నుంచి బెలూన్ ని వదిలారు. మరి కాస్త తూర్పు దిశగా జరిగి బెలూన్ ని వదిలి వుంటే అది కింద పడేటప్పుడు అట్లాంటిక్ సముద్రంలో పడిపోయేది.కనుక కాస్త రాష్ట్రం లోపలికి, తీరానికి దూరంగా వచ్చి బెలూన్ ని వదలవలసి వచ్చింది.
వదిలిన బెలూన్ ఎలా కదులుతుందో, ఎక్కడ తిరిగి భూమిని చేరుకుంటుందో తెలుసుకోడానికియూనివర్సిటీ ఆఫ్ వయోమింగ్ కి చెందిన బెలూన్ ట్రాజెక్టరీ వెబ్ సైట్ ని సంప్రదించారు. బెలూన్ల కదలికలకి సంబంధించిన సమాచారం ఈ వెబ్ సైట్ లో ఉంటుంది.
Canon Hacker’s Development Kit ని వాడి కెమేరాని తమకి అవసరమైన విధంగా ప్రోగ్రాం చేసుకున్నారు జస్టిన్, ఆలివర్ లు. ఐదు నిముషాలకి ఒక సారికెమేరా దానికదే ఫోటోలు తీసేలా ప్రోగ్రాం చేశారు. పైగా ఐదు గంటల సేపు తీసే ఫోటోలు సరిపోయేలాఅదనంగా ఓ 8-GB మెమరీ కార్డ్ కూడా కెమెరాలో జత చేశారు.
పైన కనిపిస్తున్న చిత్రం ఈ 93,000 అడుగుల ఎత్తు నుండి, అంటే 18 మైళ్లకి కాస్త తక్కువఎత్తు నుండి తీయబడింది. (అంతర్జాతీయ విమానాలు ఎగిరే ఎత్తు కేవలం 30-35 వేల అడుగులే.) లెక్క ప్రకారం అంతరిక్షం లోకి ప్రవేశించాలంటే 100 km ఎత్తు చేరాలి.ఆ అంతరిక్షపు సరిహద్దుని కార్మన్ రేఖ అంటారు. అంత తక్కువ ఎత్తు నుండి తీసినాగోళాకారపు భూమి యొక్క అందంగా కనిపిస్తోంది.
కాని ఆ ఎత్తులో పీడనం తక్కువ కనుకబెలూన్ పేలిపోయి కెమేరా ఉన్న పెట్టె కింద పడిపోయింది. ఓ నలభై నిముషాల పాటు భద్రంగా ప్రయాణించినకెమేరా పెట్టె భూమికి తిరిగొచ్చింది.
ఈ ప్రయోగం పేరు ప్రాజెక్ట్ ఐకరస్. ఈ ఐకరస్ ఓ గ్రీకు పౌరాణిక పాత్ర పేరు. రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నించి, చివరికి ప్రాణాలు కోల్పోతాడు.
Reference:
http://www.wired.com/gadgetlab/2009/09/the-150-space-camera-mit-students-beat-nasa-on-beer-money-budget/

No comments:
Post a Comment