ITEACHERZ QUICK VIEW

05 February, 2015

* ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలతో త్వరలోభేటీ* విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయం - ఈనాడు, హైదరాబాద్:

పాఠశాలలు,ఉపాధ్యాయుల సేవలను హేతుబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ భావిస్తోంది. డీఎస్సీ-2014 ద్వారా కొత్తగా విధుల్లోకి ఉపాధ్యాయులు వచ్చేనాటికల్లా.. ఈ ప్రక్రియ పూర్తిచేసి
పరిస్థితులను చక్కదిద్దాలని యోచిస్తోంది. ఈ రెండు అంశాలకు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్  విద్యా శాఖ కార్యదర్శి శిసోడియా, కమిషనర్ సంధ్యారాణి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 13జిల్లాల విద్యాశాఖ అధికారులతో సమావేశమైన వీరు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిణామాలపట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేచర్యల్లో భాగంగా ఉపాధ్యాయసంఘాలు, ఎమ్మెల్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించి,
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని వివరించి సహకారాన్ని కోరాలని
నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భౌతికశాస్త్రంవిభాగంలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే గణితంలో తక్కువగా ఉన్నారు. ప్రాథమిక సమాచారం
ప్రకారం..రాష్ట్ర వ్యాప్తంగా 8,959 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకే
ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. విద్యా
హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో
కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా వివిధ పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న
15,000 మంది ఉపాధ్యాయుల
సేవలను హేతుబద్ధీకరించాలని అధికారులు కొద్దికాలం కిందటే ప్రతిపాదించారు.
సమయాభావం దృష్ట్యా వీరి సేవలను జిల్లా విద్యా శాఖ అధికారుల ద్వారా
అవసరమైన పాఠశాలల్లో అందేలా చర్యలు
తీసుకున్నారు. ఈ ప్రక్రియ కొన్నిచోట్ల బాగా జరగ్గా.. మరికొన్నిచోట్ల!! అంతంతమాత్రంగానే అమలెంది. ఈ పరిస్థితుల్లో విద్యా శాఖ ఉన్నతాధికారులు పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు వీలుగా కొత్త కమిటీలు
ఏర్పాటుచేసి నివేదికలు తెప్పించనున్నారు.అలాగే పాఠశాలల స్థితిగతుల్ని.తెలుసుకునేందుకు మ్యాపింగ్
సైతం చేయనున్నారు. విద్యార్థుల
ప్రవేశాల ప్రక్రియలో అవకతవకలు జరగకుండా.. లోపాలుతలెత్తని విధంగా ఆధార్
సంఖ్యతో గట్టి చర్యలు తీసుకోవాలని
భావిస్తున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి సిసోడియా, కమిషనర్ సంధ్యారాణి సోమవారం దూరవిద్యలో పది, ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా
వెల్లడించారు.డీఈఓ-.పీఓల మధ్య
సమన్వయం పెంపు ఎలా?రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు డైరెక్టరుగా, విద్యా శాఖ
కమిషనరుగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు
ఉండేవారు. తెదేపా అధికారంలోనికి వచ్చిన
అనంతరం ఈ రెండింటినీ ఒక్కరే చూస్తున్నారు. ప్రస్తుతం ఈ.రెండు
బాధ్యతల్ని సంధ్యారాణి నిర్వర్తిస్తున్నారు. ఈ.క్రమంలో జిల్లాల్లో ఉండే డీఈఓ,.పీఓల మధ్య
సఖ్యత పెంచాల్సిన అవసరం ఉందని,
పనివిభజన చేసి ఇద్దరిల. చురుకుదనం
పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అలాగే రెండు శాఖల్లో ఇంజినీరింగ్ విభాగాలు వేర్వేరుగా ఉన్నాయి.
ఆర్ఎంఎస్ఏ, రాజీవ్ విద్యా మిషన్, ఏపీ విద్య మౌలిక సదుపాయాల సంస్థ వంటి విభాగాల ఆధ్వర్యంలో ఒకే పాఠశాలలో
నిర్మాణాలు వేర్వేరు విభాగాల కింద జరుగుతున్నాయి. ఇకపై ఇలా జరగకుండా..
ఇంజినీరింగ్ విభాగాల మధ్య కూడా అంతరాలు తొలగించాలన్నది అధికారుల
వ్యూహం.

No comments:

Post a Comment

Popular Posts