ITEACHERZ QUICK VIEW

10 July, 2016

10 ప్రశ్నపత్రంలో సమూల మార్పులు * సంస్కరణల దిశగా విద్యాశాఖ * 2016-17 విద్యా సంవత్సరం నుంచే అమలు

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు చేస్తున్నారు. ఇకపై ప్రతి సబ్జెక్టులో రాత పరీక్షలు 80 మార్కులకే నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. ఈ రెండిం టిని కలిపి గ్రేడ్ ప్రకటిస్తారు.

నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలు చేయడంలో భాగంగా విద్యాశాఖ ఈ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. గ్రేడింగ్ విధానంలోనూ మార్పు చేస్తోంది. నూతన విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధన పద్దతులు మార్చుకోక పోతే విద్యార్దులు నష్ట పోయే ప్రమాదముంది.

2016-17 విద్యాసంవత్సరం నుంచే పదో తరగతి విద్యార్ధులకు నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ద
తిలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయిం చింది.

దీనివల్ల విద్యార్దుల్లో జానం, అవగాహన, విని యోగం, విశ్లేషణ, మూల్యాంకనం, సృజనాత్మకత, భావవ్యక్తీకరణ పెంచేందుకు దోహద పడుతుందనేది విద్యాశాఖ భావన.
ఇక పరీక్షల విధానంలోనూ మార్పులుంటాయి. హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెకులకు రెండేసి పరీక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఇంతవరకు పబ్లిక్ పరీక్షల్లో ఒక్కో పేపరు 50 మార్కు లకు ఉండేది. ఇకపై 40 మార్కులకు పబ్లిక్ పరీక్ష 10 మార్కులకు అంతర్గత మూల్యాంకసం ఉంటుంది.

ప్రశ్నల తీరులోనూ మార్పులే
గతంలో ప్రశ్నపత్రం 35 మార్కులకు (23 ప్రశ్నలు), 15 మార్కులకు బిట్ పేపరు (30 ప్రశ్నలు) ఇచ్చేవారు. ప్రశ్నపత్రంలోని ప్రతి విభా గంలో అంతర్గత ఎంపిక ఉండేది.

నూతన విధా నంలో ప్రధాన ప్రశ్నపత్రంలో 30 మార్కులకు 18 ప్రశ్నలే ఇవ్వనున్నారు. అంతర్గత ప్రశ్నల ఎంపికలో వారిచ్చిన రెండు ప్రశ్నల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రాయాలి.
ఇంతకుముందు ఆయా సెక్షన్లలో ప్రశ్న లను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్ధికి ఉండేది. ఇప్పడది లేదు.
ఇక బిట్ పేపరులో 10 మార్కుల కోసం 20 ప్రశ్నలుంటాయి. నూతన విధానంలో కేవలం వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే అంతర్గత ఎంపిక ఉంది.
మిగిలిన విభా గాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాల్సిందే. గతంలో 23 ప్రశ్నల్లో 14కు మాత్రమే జవాబు రాయాల్సి ఉండేది.
ఇపుడు వ్యాసరూప ప్రశ్నలు తప్ప, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘు ప్రశ్నల న్నింటికీ జవాబు రాయాల్సిందే.
ప్రధమ, తృతీయ భాషతో పాటు, గణితం, సైన్సు గ్రూపుల్లో ప్రశ్నలిలా.
నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో గణితం, సైన్సు సాంఘిక శాస్త్రంలో ప్రతి పేపరులో నాలుగు లఘు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు రెండేసి. నాలుగు వ్యాసరూప ప్రశ్నలకు నాలుగేసి చొప్పన మార్కులు ఉంటాయి.
బిట్ పేపరులో బహుశైచ్చిక ప్రశ్నలు 20 ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకుసాంఘిక శాస్త్రంలో 35 శాతం మార్కులు సాధించాలి.
అంటే సమ్మేటివ్-3 లో తప్పనిస రిగా 28 మార్కులు పొందాలి. మిగిలిన 7 మార్కులు అంతర్గత మూల్యాంకనంలో సంపా దించాలి.
ద్వితీయ భాషలో ఉత్తీర్ణత మార్కులు 20. సమ్మేటివ్-3లో 16మార్కులు తప్పని సరి.
మిగిలిన 4మార్కులు అంతర్గత పరీక్షలో సాధించాలి.
సమ్మేటివ్-3లో కానీ, అంతర్గత మూల్యాంకనంలో కానీ నిర్ణీత మార్కులు తగ్గితే ఆ విద్యార్థి ఉత్తీర్ణత కానట్లే.
దీనిపై మొదటి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయులూ విశ్లేషణాత్మకంగా బోధించాలి. బట్టీ విధానం నుంచి పిల్లలను బయటకు తీసుకురావాలి. గైడ్లు, కొశ్చన్ బ్యాంకులు, స్టడీ మెటీరియల్ చదివే అలవాటు నుంచి బయట పడితేనే విద్యార్థులకు మేలు జరుగు తుంది. కంఠస్టం పడితే కష్టమే
నూతన పరీక్ష విధానంలో కంఠస్థం మీద ఆధారపడే విద్యార్దులకు కషాలు తప్పవు.
ప్రశ్న పత్రం తయారీలో ఒక్కో పేపరులో అవగాహనప్రతిస్పందనకు 16 మార్కులు,
వ్యక్తీకరణ, సృజనాత్మ కతకు 4 మార్కులు,
ప్రయోగం, పరిశోధనకు 6 మార్కులు,
సమాచార నైపుణ్యానికి 6 మార్కులు,
కమ్యూనికేషన్కు 4 మార్కులు,
అప్లికేషన్ (ప్రయో గం)కు 4 మార్కులు వంతున కేటాయిస్తూ బూప్రింట్ తయారు చేశారు.
ఒక్కొక్క ప్రశ్న కు అర మార్కు ఉంటుంది.
అవగాహన లేకుంటే ఆంగ్లం గోవిందా😳
పుస్తకంపై అవగాహన లేకుంటే ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత కావడం అంత సులభం కాదు. గతంలో ఆంగ్ల పరీక్షలో మొదటి పేపరు పార్డ్-ఏలో 20 మార్కులు, పార్ట్-బిలో 30 మార్కులు ఉండేవి. పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చేవారు. నూతన విధానంలో పార్ట్-ఏలో 25 మార్కులు, పార్ట్-బిలో 15 మార్కులుంటాయి.
పాఠ్యపుస్తకానికి సంబంధించి ఒక పద్యం ఇచ్చి. అందులో రెండు ప్రశ్నలిస్తారు. వీటికి రెండు మార్కులుంటాయి. మిగిలిన 18 మార్కులకు 5 పేరాగ్రాఫ్లు ఇవ్వను న్నారు. ఇవన్నీ పాఠ్యపుస్తకం లోనివే. వ్యాసరూ పంలో నాలుగు ప్రశ్నలుంటాయి.
అందులో గద్య భాగం నుంచి రెండు. పద్యభాగం నుంచి రెండు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోభాగం ఒక్కో ప్రశ్నకు సమా ధానం రాయాలి. పార్ట్-బిలో విద్యార్థి నైపుణ్యం, మేధోశక్తి పరిశీలించే లఘు ప్రశ్నలు, బహుశైచ్చిక ప్రశ్నలను 15 మార్కులకు ఇవ్వనున్నారు.
ఇక ఆంగ్లం రెండో పేపరులో పార్ట్-ఏ 25, పార్ట్-బి 15 మార్కులకు ప్రశ్న లుంట యే
పార్ట్ఏలో మూడు ప్యాసేజీలు. ఒక్కోదానికి స్ మార్కులు చొప్పన ఇస్తారు.
లెటర్ రైటింగ్కు 5,
హింట్స్ డెవలప్ మెంట్కు 5 చొప్పున మార్కులు కేటాయించారు.
పార్ట్-బిలో 15 మార్కులకు వ్యాక రణం ఉంటుంది.
పరీక్షా సమయం పెంపు పదో తరగతి పరీక్షా సమయం పెంచుతున్నారు.
ఇంతవరకు పరీక్షకు 2:30గంటలు కేటాయించే వారు. నూతన పరీక్షా విధానం అమల్లోకి తెస్తుండడంతో 2:45 గంటల సమయం కేటాయిస్తారు.
ప్రశ్నల సంఖ్య తగ్గినా.. ఆలోచనాత్మకంగా, విశ్లేషణతో జవా బులు రాయాల్సి ఉండటంతో సమయం మరో 15 నిమిషాలు పెంచారు.
-
గ్రేడింగ్ విధానంలోనూ మార్పు
పదో తరగ పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టిన విద్యాశాఖ గ్రేడింగ్ విధానంలోనూ మార్పు చేస్తోంది. బాహ్య అంతర్గత మూల్యాంక నాలకు వేర్వేరుగా గ్రేడులు ఇవ్వనున్నారు.
తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్సు, సోషల్ సబ్జె కుల్లో బాహ్య మూల్యాంకనానికి
91-100 కి ఏ1,
81-90 ఏ 2.
71-80 బి 1,
61-70 బి-2,
51-60సి-1 ,
41-50కి సి-2 .
35-40కి డి-1,
0-34 డి-2 గ్రేడులు నిర్ధా రించారు.
ఇక హిందీలో
90–100కి ఏ1
79-89 కి ఏ 2
68–78 కి బి 1
57-67 కి బి 2
46-56 కి సి 1
35-45కి సి 2,
20:4 డి1,
0-19 డి గ్రేడులుగా నిర్ణయించారు.
ఇక సహపాఠ్య కార్యక్రమంలో 💐💐
85-100కి ఏ ప్లస్,
71-84కి ఏ
56-10కి బి
41-55కి సి,
0-10కి డి గ్రేడ్ నిర్ణయించారు.
గ్రేడు, పాయింటు పరిశీలిస్తే. ఏlకు 10,
ఏ2కు 9,
బి1కి 8
బి2కు 7 ,
సి1కి 6,
సికు 5
డి1కి 4 పాయింటు ఇవ్వనున్నారు.

2 comments:

  1. I’m really happy to say it was an interesting post to read. I learned new information from your article, you are doing a great job. Continue

    Online Breaking Telugu News
    Telangana Districts News
    Andhra Pradesh Districts News

    ReplyDelete

Popular Posts