Pages
▼
Poetry I like most :: The Mother Hood by Smt.Meraj Fathima Garu
అమ్మతనం
కల్లు తాగిన కారుకూతల్లో
తన తల్లినే పతితగా వింటుంది.
కట్న కానుకలు తక్కువనే కరకునోళ్ళకు ,
జడిసి తల వంచుకుంటుంది.
ఆడపిల్లని కన్నావని తూలనాడినా,
తప్పు తనదే అనుకుంటుంది.
బిడ్డల నడవడిక బాగలేకున్నా,
తానే కారణమంటే నిజమే అనుకుంటుంది.
యెడారి ప్రస్తానంలో తీరని దాహాల వెంట,
పరుగులెడుతూనే ఉంది.
నడివయస్సులో కూడా తనవారికోసం,
పడిలేస్తూ పనిచేస్తూనే ఉంటుంది .
కన్నకూతురికి పెళ్ళి చేసి ,
తనలాంటి రాత వద్దని మొక్కుకుంటుంది.
కోడలి నాగరికత ముందు,
నిశాని అయిన తానే తలఒగ్గుతుంది.
అందరిలో ఉన్నా ఒంటరితనం,
తన తప్పులేకున్నా నిందమోసేతనం.
ఇంటిల్లిపాదికీ నీడనిచే తరువుతనం,
అమ్మ పేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
30.4.13.
my comment:
.
No comments:
Post a Comment