Pages

27 September, 2011

అవినీతిపై పోరాటం ఇంత సులువా?

Anna_Hazare

ప్రభుత్వ ఉత్తర్వును ఎత్తి చూపుతున్న అన్నా హజారే
        అన్నా హజారే! ఇప్పుడు చాలామంది భారతీయుల నోట నానుతున్న పేరు. నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడని భావిస్తున్న బ్రహ్మచారి. గాంధేయుడయిన హజారే, గాంధీ బోధించిన అహింసా సిద్ధాంత పద్ధతిలో పోరాటం చేసి రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ల అవినీతి అంతానికి నడుం బిగించాడని దేశవ్యాపితంగా ప్రశంసలు పొందుతున్నాడు. ఉన్నత స్ధానాల్లోని వ్యక్తులు -మంత్రులు, బ్యూరోక్రట్ అధికారులు- విచ్చలవిడిగా అవినీతికి పాల్పడికూడా ఎట్టి విచారణ లేకుండా తప్పించుకుంటున్నారనీ, అటువంటి వారిని విచారించే అత్యున్నత రాజ్యాంగ సంస్ధను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, దానికోసం “జన్ లోక్ పాల్” పేరున మిత్రులతో కలిసి ఒక బిల్లు కూడా తయారు చేశాడు అన్నా హజారే. “జన్ లోక్ పాల్” సంస్ధ విధి విధానాలను నిర్ణయించడాన
Read More

No comments:

Post a Comment